రామకుప్పం జులై 21 (గరుడ దాద్రి)
కుప్పం నియోజకవర్గంలో పోతారపురి మామిడికాయ పండిస్తున్న రైతులు తాము పండించిన పంటను ఈనెల 28వ తేదీ లోపు తమకు కేటాయించిన పాయింట్లలో సాయంత్రం 8 గంట లోపల సరఫరా చేసుకోవాలని కుప్పం నియోజకవర్గం ఉద్యాన శాఖ ఏడి పల్లవి పేర్కొన్నారు. మంగళవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ప్రతి రైతు తాము మండిలకు తోతాపురి మామిడికాయలను తరలించేందుకు ముందు అదే రోజు ఖాళీ వాహనాల తూకం మరియు కాయలతో కూడిన వాహనాల తూకాన్ని సమర్పించాలని అలాగే ఇతర రాష్ట్రాలకు తరలించే రైతులు ఆ రాష్ట్రాల్లో ఉన్న మండీలు కానీ లేక జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద నుండి కానీ బిల్లులు తప్పక తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట రామకుప్పం, శాంతిపురం మండల ఉద్యాన శాఖ అధికారులు డింపుప్రియ,వింధ్య తదితరులు పాల్గొన్నారు.
