తరచూ రద్దవుతున్న సర్వీసులు
సమయపాలన జాడేది..?
కీలక పోస్టులన్నీ ఖాళీ
కొన్నేళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది..
కూత వేటులో శ్రీ సిటీ ఉన్నా..
కొత్త సర్వీసుల ఊసే లేదన్నా.!!
సత్యవేడు జూలై 21 గరుడధాత్రి :
సత్యవేడు ఆర్టీసీ డిపో రివర్స్ గేర్ లో నడుస్తోంది*
ఒకప్పుడు 62 సర్వీసులతో ఉన్న ఈ డిపో ప్రస్తుతం 48 సర్వీసులతో నడుస్తోంది సమయపాలన అటకెక్కింది తరచూ కండక్టర్లు డ్రైవర్లు లేరంటూ సర్వీసులు రద్దు అవుతున్నాయి కీలకమైన ఆర్టీసీ గ్యారేజ్ లోని ఏ ఎమ్ ఎఫ్ పోస్టు భర్తీ కావడం లేదు అదేవిధంగా ఎల్ హెచ్ , ఏడీసీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందువల్ల బస్సులు మరమ్మతుల గురైతే … వెనువెంటనే వాటిని బాగు చేయడంలో జాప్యం జరుగుతోంది
రద్దె ఎక్కువ..
డిపోలో ఇటీవల కాలంలో పలు సర్వీసులు రద్దువుతున్నాయి ముఖ్యంగా అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఆపేస్తున్నారు కండక్టర్ ఉంటే.. డ్రైవర్ కోసం వెతుకులాట, డ్రైవర్ ఉంటే కండక్టర్ లేక ఆగిన సర్వీసులు ఎన్నో.. సుమారు 20 మంది కండక్టర్లు, 15 మంది డ్రైవర్ల పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి …ఉన్న సిబ్బందికి అప్పుడప్పుడు అదనపు భారం, దీనికి తోడు సుమారు 20 ఏళ్లకు పైగా ఇక్కడే పాతుకుపోయిన వారితో అనేక సమస్యలు డిపోను పట్టిపీడిస్తున్నాయి వరుసగా ఒకటి రెండు రోజులు డ్యూటీలు చేసి… రెండు రోజులు స్పెషల్ ఆఫ్ కింద కొందరు వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితి వల్ల కూడా బస్ సర్వీసులు ఆగిపోతున్నాయి ప్రధానంగా బస్టాండ్ వద్ద ఏ బస్సు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలిపే సమాచారం ఇక్కడ శూన్యం. బస్సు వచ్చిందా ఎక్కండి…. లేదా మీ పాట్లు మీవి అన్నట్లు డిపో మేనేజర్ వైఖరి ఇక్కడ కొనసాగుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు
ఆరు దాటితే అంతే సంగతులు..
ఆర్టీసీ డిపో ఉన్న సత్యవేడులో సాయంత్రం 6 దాటితే బస్సులు ఉండవు.. సాయంత్రం వేళల్లో బస్ సర్వీసులు పెంచాలని, పక్కనే ఉన్న శ్రీ సిటీ సహకారంతో శ్రీ సిటీ గ్రామాల్లోకి, సులూరుపేటకు సర్వీసులు తిప్పాలని దాదాపు ఐదేళ్లకు పైగా ప్రతిపాదనలు ఉన్నాయి వాటిని కార్యరూపం దాల్చే దిక్కే లేదు
నిర్లక్ష్యం చేస్తే..వదులుకోవాల్సిందే
డిపో పరిధిలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్ టి సి
ఆర్ ఎం దృష్టికి తీసుకెళ్లారు పూర్తిస్థాయిలో ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుని చక్కదిద్దకపోతే.. డిపోను వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతమున్న డిపో మేనేజర్ కూడా బదిలీ కోసం ఎదురుచూస్తూ… తన పుణ్యకాలం పూర్తి చేసేందుకు చూస్తున్నారే గాని ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడంతోనే సమస్యలు వేధిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి
