గరుడ ధాత్రి న్యూస్ దువ్వూరు జూలై 24
కడప జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రాజా వెంకట వరలక్ష్మి గారు దువ్వూరులో నిర్వహించిన మహిళా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
సమావేశానికి ముందు చిలంకూరు వీర వెంకట స్వామి గారు జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు, కమిటీ సభ్యులకు ఆలయ విశిష్టతలను వివరించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం, పూజలు నిర్వహించి, రాజా వెంకట వరలక్ష్మి గారితో పాటు కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకాలు చేపట్టగా, దువ్వూరు మండలం నుంచి చిలంకూరు పుష్పలత గారిని జిల్లా ఉపాధ్యక్షురాలిగా, లింగం ఉషారాణి గారిని జాయింట్ సెక్రటరీగా, జూటూరు అంజన దేవి గారిని ఈసీ సభ్యురాలిగా నియమించారు.
అలాగే దువ్వూరు మండల ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఈపూరి భారతి గారికి నియామక పత్రాన్ని అందజేశారు. మండల సెక్రటరీగా ఆరవేటి సుజాత, కోశాధికారిగా చిలంకూరు సుధామణి గారిని నియమించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, మహిళా మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా ఎన్నికైన బాధ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
