ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజాతీయ పతాక స్వీకరణ దినోత్సవం చౌడేపల్లి లో ఘనంగా నిర్వహించారు

జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం చౌడేపల్లి లో ఘనంగా నిర్వహించారు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 22 గరుడ ధాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము వద్ద వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరము జూలై 22 న జరుపుకుంటాము 1947 జూలై 22 న రాజ్యాంగ సభ అధికారికంగా మన త్రివర్ణ పతాకాన్ని ఆమోదించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య మన జాతీయ జెండాను రూపొందించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ శ్రీమతి ఇస్తా నాగలక్ష్మి మన స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జెండాని ఎగరవేసేటప్పుడు భారత జాతీయ జెండా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు, త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించిన రోజు ఇది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ శ్రీమతి ఇస్సా నాగలక్ష్మి, వాసవి క్లబ్ గౌరవాధ్యక్షులు ముని రామకుమార్ ,వాసవి క్లబ్ వనితా క్లబ్ అధ్యక్షులు శ్రీనాథ్, రంగవల్లి, కార్యదర్శులు లోకేష్, నాగలక్ష్మి మరియు మెంబర్స్ అందరూ పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!