ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద అవార్డు అందుకుంటున్న డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వద్ద అవార్డు అందుకుంటున్న డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం జూలై 22 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకమైన ISO 9001:2015 నాణ్యత నిర్వహణ వ్యవస్థ సర్టిఫికేషన్ లభించింది. రాష్ట్ర కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ తాడేపల్లి, వారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. వి. కృష్ణ తేజ గారు*, IAS వారి చేతుల మీదుగా స్వీకరించడం జరిగినది. జిల్లా కలెక్టర్ *సుమిత్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ కార్వేటి నగరం గ్రామ పంచాయతీ, పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ అభినందించడం జరిగినది.చిత్తూరుజిల్లాలో ISO 9001:2015 సర్టిఫికేషన్‌ను పొందిన తొలి గ్రామ పంచాయతీగా కార్వేటినగరం గ్రామ పంచాయతీ చరిత్ర సృష్టించింది.ఈ ఘనత కార్వేటినగరం గ్రామ ప్రజలందరికీ చెందుతుంది. అలాగే మా గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి అంకితభావం, సమిష్టి కృషికి ఇది నిదర్శనం. గ్రామ పంచాయతీ ఈ అరుదైన గౌరవాన్ని చిత్తూరు జిల్లాకు తీసుకురావడం మాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డు అందుకున్న డిప్యూటీ ఎంపీడీవోకి ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి మరియు సిబ్బంది గ్రామస్తులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!