ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపలమనేరులో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్

పలమనేరులో దస్తావేజు లేఖరుల పెన్ డౌన్

📰 Generate e-Paper Clip

పలమనేరు, జూలై 22 ( గరుడ ధాత్రి ) : పలమనేరులో మంగళవారం కూడా దస్తావేజు లేఖ రులు పెన్ డౌన్ చేసి రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలి పారు. దీంతో మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దస్తావేజులు నిర్వహించే విధులను ప్రైవేటుకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో 396ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు ఈనెల 31వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడు తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా పలమనేరులో కూడా దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ చేపట్టి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు ఉమా శంకర్, జగజ్జీవన్రావు, గురునాధం, ముజీబ్భాషా, రాజు, మునిరాజు, సుబ్రహ్మణ్యంరెడ్డి, ఉబేద్, చందరబాబు, భార్గవ్, మునీశ్వర, శివారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, యువరాజు, కోటీశ్వర్, జ్ఞానేశ్వర్, సుబ్రహ్మణ్యం, సతీష్, హరినాథరెడ్డి, చంద్ర, సురేంద్రనా యుడు, మంజునాథ్, ప్రకాష్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!