పలమనేరు, జులై 22 ( గరుడ ధాత్రి ) :
జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు బుధవారం పలమనేరు పట్టణంలో పోలీసులు విస్తృతంగా ‘ఫుట్ పెట్రోలింగ్’ నిర్వహించారు. పలమనేరు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలసి పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో కాలినడకన పర్యటించారు.
ఈ పెట్రోలింగ్ కార్యక్రమంలో భాగంగా గంగమ్మ గుడి వీధి నందు రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. రోడ్డు పక్కన ఆక్రమణలుగా ఉన్న పెట్టి షాపుల యజమానులకు పోలీసులు స్పష్టమైన అవగాహన కల్పించారు. రోడ్ల ఇరువైపులా షాపులు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు, బాటసారులకు ఇబ్బందులు ఎదురై ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే ఆ షాపులను తొలగించి ట్రాఫిక్ రాకపోకలకు సహకరించాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాబట్టి వ్యాపారస్తులు పోలీసుల చర్యలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
