ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

📰 Generate e-Paper Clip

గుడిపల్లి మండల టిడిపి అధ్యక్షులు సుబ్రమణి.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): ప్రభుత్వ విద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మెగా పీటీఎం కార్యక్రమం గుడిపల్లి మండలంలో జరిగింది . గురుపల్లెలోని కస్తూర్బా గాంధీ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గుడుపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ గుడిపల్లి లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సంవత్సరం పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినికి ఆయన 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థినికి వి సురేష్ జనరల్ సెక్రెటరీ 3000 రూపాయలు నగదు రూపంలో బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు బాబు నాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!