ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిభక్తులతో కిటకిటలాడిన శ్రీశక్తి పీఠాలు

భక్తులతో కిటకిటలాడిన శ్రీశక్తి పీఠాలు

📰 Generate e-Paper Clip

రామచంద్రపురం: వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రామచంద్రపురం మండలంలోని శ్రీ శక్తి పదవరోజు భక్తులతో నిండిపోయింది.
ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రమైన తిరుపతి శ్రీ శక్తిపీఠంలో నిర్వహించబడుతున్న శ్రీ వారాహీ నవరాత్రి మహోత్సవములలో 10వ రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా *కుటుంబ సఖ్యత, సౌభాగ్యం, భూ/గృహ సమస్యా పరిష్కారం* కొరకు విశేష ఫలదాయకమైన
*శ్రీ రాజరాజేశ్వరి, శ్యామల & వారాహీ మంత్ర హోమం* ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించబడినది.
స్త్రీమూర్తులకు సువాసిని పూజా,
మధ్యాహ్నం అమ్మవారికి మహా హారతి సమర్పించబడగా, సాయంత్రం 750 స్త్రీమూర్తులకు సువాసినీ పూజ నిర్వహణ,కళా నివేదన రూపంలో సంగీత, నాట్య, సాహిత్య సేవలు అమ్మవారికి అంకితం చేయబడినవి.
రాత్రి వేళ పరమపూజ్య శ్రీ మాతాజీ వారి సమక్షంలో నవరాత్రి పూజ, దర్బారు సేవ జరుగగా, నడిచే దైవం జగద్గురువుల వారిచే మహా హారతి, అనంతరం అమ్మవారికి ఏకాంత సేవ నిర్వహించబడినవి.
ఈ పుణ్యదినాన సుమారు 15,000 మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి దివ్య దర్శన భాగ్యాన్ని పొందారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ సమృద్ధిగా జరిగినది, ఇది గురు-దైవానుగ్రహానికి, పీఠం సేవాతత్పరతకు నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!