ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం.

విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం.

📰 Generate e-Paper Clip

* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం.
* కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలలో విజయవంతంగా మెగా పేరెంట్స్ మీటింగ్లు.
* ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు, విద్యార్థులకు పోటీలు, బహుమతుల ప్రధానం.
* పండుగ వాతావరణం లో మెగా పేరెంట్స్ మీటింగ్లు.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలలో ఉన్న పాఠశాలల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ 4వ మీటింగ్లు జరిగాయి. ఈ పేరెంట్స్ మీటింగుల్లో కుప్పం టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎఫ్‌సీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో మాట్లాడుతూ, విద్య, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఆధునికీకరిస్తూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నది అన్నారు .తల్లికి వందనం వంటి పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం అందించి విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కుప్పం నియోజకవర్గాన్ని విద్య, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో ముందుకు సాగి ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఈ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం కొత్తపేట 11వ క్లస్టర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది.ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్ రోజా మదన్, 11వ క్లస్టర్ ఇంచార్జ్ కె. కన్నన్, కో క్లస్టర్ తిరుమగల్, ఎక్స్ ఎం పి టి సీ కృష్ణన్, ఎక్స్ స్కూల్ చైర్మన్ లక్ష్మీపతి, వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ లోకేష్, బూత్ ఇన్చార్జులు మనీ, మోహన్, కృష్ణ ఉదయ్ కుమార్ హరినాథ్ గౌడ్, దిలీప్, టిడిపి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డీకే పల్లి పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో నాయకులు ప్రసంగించారు. కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు ప్రసంగించారు . విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు .మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సతేంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ మణి, సెక్రెటరీ నబి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కుప్పంలోని ఎమ్ ఎఫ్ సి ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఒకేషనల్ విభాగంలో మెగా పేరంట్ మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎంపీపీ డాక్టర్ వి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!