ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅంగరంగ వైభవంగా బాటగంగమ్మ తల్లి గెరిగ గ్రామోత్సవం

అంగరంగ వైభవంగా బాటగంగమ్మ తల్లి గెరిగ గ్రామోత్సవం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి జూన్3 గరుడదాత్రి :
బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేట గ్రామంలో గంగజాతర సందర్భంగా 3వ రోజు బుధవారం అంగరంగ వైభవంగా భాటగంగమ్మ తల్లి గెరిగాఊరేగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ భాటగంగమ్మ గెరిగా గ్రామ పురవీధుల్లో ఊరేగింపు డప్పు వాయిద్యాలు,మంగళ వాయిద్యాలు ,నయాండీ డ్యాన్స్ లు,కీలుగుర్రలు ప్రధర్శనల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గెరిగా ఉదయం 10 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నది.మధ్యాహ్నం దాతలు తంగావేలప్ప గారి మహేశ్వరి వినోద్ కుటీంబీకులు చే అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే దాతలు సహకారాం తో లడ్డు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం అలయంవద్ద మహిళా భక్తులు చే అమ్మవారికి పొంగళ్ళు అతివైభవంగా కొనసాగింది. అలాగే గ్రామ పురవీధుల్లో గజమాల హారం భాటగంగమ్మ యువకుల సంఘం వారిచే ఊరేగించారు.రాత్రి శ్రీ భాటగంగమ్మ తల్లికి బాణాసంచ వేడుకలు మధ్య మహామంగలహారతి చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండలం నుంచే కాకుండా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!