ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లేందుకు దేవాలయాల నిర్మాణం

ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లేందుకు దేవాలయాల నిర్మాణం

📰 Generate e-Paper Clip

* టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారామ్.
* తొలి దశలో 139 దేవాలయాల మంజూరు.
* రెండో విడతలో 100 దేవాలయాలకు ప్రతిపాదనలు.
* 25 లక్షలతో ప్రతి ఆలయం నిర్మాణం.
* ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపుకు బాటలు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో 139 దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ పాలకమండలి సభ్యులు శాంతారామ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన గరుడ ధాత్రి దినపత్రిక ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.కుప్పం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపుకు బాటలు వేస్తున్నామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వాణి టెస్ట్ ద్వారా తొలి దశలో 139 దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. దాపు 40 శాతం దేవాలయాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఈనెల 12వ తేదీ పైన మిగిలిన దేవాలయాల పనులు ప్రారంభమవుతుందన్నారు. మలి దశలో మరో 100 దేవాలయాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి దేవాలయాన్ని 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. దేవాలయాలు సమాజంలో ప్రజలను ఒకచోట చేర్చి ఐక్యతను మరియు సత్సంబంధాలను పెంపొందించడానికి వేదికగా నిలుస్తాయి అన్నారు. తద్వారా గ్రామాలలో ప్రశాంత వాతావరణ నెలకొంటుందని, ప్రజలు సంతోషంగా జీవిస్తారని పేర్కొన్నారు. మన సంప్రదాయాలు,కలలు, శిల్పకళ మరియు ధర్మాన్ని భావితరాలకు అందించడంలో దేవాలయాలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. దేవాలయాలు చుట్టూ స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక భావాలు పెంపుకు కృషి చేస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!