ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆరణియార్ నదిలో పది లక్షల చేప పిల్లల విడుదల

ఆరణియార్ నదిలో పది లక్షల చేప పిల్లల విడుదల

📰 Generate e-Paper Clip

-మత్స్య సంపద అభివృద్ధికి అధికారుల చర్యలు

పిచ్చాటూరు, అక్టోబర్ 26 గరుడదాత్రి న్యూస్ :

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని ఆరనియార్ నదిలో పది లక్షల చేప పిల్లలను అధికారులు విడుదల చేశారు. నదిలో మత్స్య సంపదను పెంపొందించడంతో పాటు, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాజేష్, తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఏఈఈ శ్రీధరణి, డి. నాగరాజు, ఎఫ్‌డీఓ డాక్టర్ బి. మధుసూదన్ రావు, ఏఎఫ్‌సీఓ ఎఫ్/సీ బీబీఓ జి. మహేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు లైసెన్స్ పొందిన మత్స్యకారులు కూడా చేప పిల్లలను నదిలో విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
నదిలో చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్య సంపద వృద్ధికి తోడ్పాటు లభించడంతో పాటు, భవిష్యత్తులో మత్స్యకారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మత్స్య సంపద పరిరక్షణకు, అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!