గరుడధాత్రి :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ తో వృద్ధులకు, వితంతువులకు, ప్రత్యేక అవసరాలు వారికి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
జూన్ 1వ తేదీన సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిచ్చాటూరు మండలం పులికుండ్రంలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయంలోనే పింఛన్లు భారీగా పెరిగిందని, తద్వారా వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక అవసరాల వ్యక్తులు అన్నీ విధాలుగా ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు.
అలాగే స్పౌస్ ద్వారా వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు అవుతోందని, రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వితంతువులు దీని ద్వారా లబ్ది పొందనున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మహమ్మద్ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, నాయకులు పద్దు రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-డాక్టర్ మునస్వామి భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి
ఉదయం 8.00 గంటలకు తడ మండలం మాంబట్టు కు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేరుకొని మృతి చెందిన స్విమ్స్ రిటైర్డ్ డాక్టర్ మునస్వామి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
