ఎస్వీబీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని తెలుగుదేశం పార్టీ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తూ తాజాగా ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవి తనకు లభించడంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చూపిన చొరవ, సహకారం మరువలేనిదని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న శ్రీధర్ వర్మ, ఎస్వీబీసీ ద్వారా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీధర్ వర్మకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మ అనుచరులు, టీడీపీ యువనేత బెజవాడ భరత్ తదితరులు పాల్గొన్నారు
