– పరిశీలన రైతులకు సూచనలు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు3
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న “ఎల్ నినో ” వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే దిశగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విద్యాలయ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి పరిధిలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో శాస్త్ర వేత్తల బృందం, మరియు శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, బైరెడ్డిపల్లి వ్యవసాయ అధికారి, మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సోమవారం సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలం లోని పాతూరు నత్తం గ్రామములో ఎల్ నినో ప్రభావం వలన ఎండిన వేరుశనగ పంటను పరిశీలించారు. పూత దశలో ఉన్న వేరుశనగ పంటను గమనించగా, నీటి సదుపాయం లేనందున నీటి ఎద్దడికి గురైన పంట ఎండినట్లు గుర్తించారు. పంటను నీటి ఎద్దడి నుండి కాపాడేందుకు 2 శాతం యూరియా (20 గ్రాములు యూరియా) లేదా డి ఎ పి 0.5 శాతం (5 గ్రాములు) లేదా 19-19-19 0.5 శాతం ( 5 గ్రాములు) లేదా పొటాషియం నైట్రేట్ 0.5 శాతం (5 గ్రాములు) లీటరు నీటికి చొప్పున కిలిపి పైపాటుగా పిచికారీ చేయాలి.
వర్షాభావం దృష్ట్యా ఇంకా పంట వేసుకోని రైతులు , వారి అనుకూలతను బట్టి ఎత్తుమడులు – కాలువల పద్ధతిలో పంటను వేసుకోవాలి. వర్షం ఆలస్యమయ్యే పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలను ( జొన్న / సజ్జ / ఆముదం / కంది) వేసుకోవాలి. కడప నత్తం గ్రామములో సోయాచిక్కుడు పంటను సందర్శించారు. Ɓసొయా చిక్కుడు పంటలో నీటి ఎద్దడి వల్ల మొక్క ఎదుగుదల సరిగ్గా లేనట్లు గుర్తించడం జరిగింది. ఈ పంటలో కూడా పోషకాల పిచికారీ ( యూరియా / 19-19-19 / పొటాషియం నైట్రేట్ చేయాలని) సూచించారు.వేరుశనగలో ఎండు తెగులు మరియు రసం పీల్చు పురుగులు గమనించడమైనది. రసం పీల్చు పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. మండలంలో వివిధ దశల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ సాగులో ఉన్న వివిధ పంటలను, సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంలోని వివిధ పద్ధతులను రైతు సాధికారిక సంస్థ సిబ్బంది వివరించారు.
ఈ కార్యక్రమం లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి 10 మంది శాస్త్రవేత్తలు వ్యవసాయ కళాశాల నుండి ఐదు మంది అధ్యాపకులు డా. నాగమాధురి, డా. దేవకీ, డా. భారతి, డా.మహేశ్వర రెడ్డి డా. విశ్వనాథ్ డా. రూపేష్ కుమార్ రెడ్డి, డా. నిర్మల్ రవి కుమార్, డా. రెడ్డి రాము, డా. హేమలత, డా. హారతి, డా. లీలావతి, డా. పాండురంగ, డా. గణేష్, డా. అమరావతి, మొ మరియు శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి విద్యార్థులు పాల్గొన్నారు.మండల వ్యవసాయ అధికారి గీతా కుమారి, వారి సిబ్బంది,శివ శంకర్ డీపీఎం వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
