ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎస్ సి వి జన్మదిన వేడుకలు - పలు సామాజిక సేవా కార్యక్రమాలు

ఎస్ సి వి జన్మదిన వేడుకలు – పలు సామాజిక సేవా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి తో పాటు పలు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ సి వి అభిమానులు విచ్చేసి ఎస్ సి వి నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్ సి వి నాయుడు స్వగృహంలో నాయకులు అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకు ల ను ఎస్ సి వి నాయుడు కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు.
పార్టీల కు అతీతంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు విచ్చేసి ఎస్ సి వి నాయుడు ను గజ పూలమాలలతో, శాలువ లు తో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నాయకులు పూల కిరీటాలు, ప్రత్యేకంగా తయారు చేసిన మాలలతో ఎస్ సి వి నాయుడు ను సత్కరించారు.
స్థానిక అర్చకులు, వివిధ మత పెద్దలు విచ్చేసి ఎస్ సి వి నాయుడు ను ఆశీర్వదించారు. ప్రజానాట్యమండలి కళాకారిణి ఎస్ సి వి సేవా గుణాన్ని చాటేలా జానపద గీతాన్ని ఆలపించి అలరించారు. నాయకులు, అభిమానులతో ఎస్సీవీ నాయుడు గృహం జన సందడిగా మారింది.
ఎస్ సి వి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్సీవీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఏరియా హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎస్సివి శ్రీకాంత్ ప్రారంభించి పంపిణీ చేశారు. స్థానిక పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎస్ సి వి శ్రీకాంత్, టిడిపి నాయకులు ప్రవీణ్, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించి పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. పలుచోట్ల మజ్జిగ , పండ్ల రసాలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు ఎస్సీవి నాయుడు జన్మదిన వేడుకలను ఎస్ సి వి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!