బైరెడ్డిపల్లి గరుడదాత్రి మే31
బైరెడ్డిపల్లి మండలం లోని బేలుపల్లి గ్రామ పంచాయితీకి చెందిన పట్నపల్లి లో ఆదివారం రాత్రి పౌర్ణమి సందర్భంగా కనుల పండువుగా
శ్రీ హస్తగిరి కల్యాణ వెంకటరమణ స్వామికి గరుడసేవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు బృందంచే ఉదయం మూలవర్లకు పంచామృత అభిషేకము కొనసాగింది.రాత్రి శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను వివిధ అలంకరణలు తో తీర్చిదిద్ది గరుడవాహనం పై ఆశీనులుచేసి ఆలయం చుట్టూ గరుడ సేవ కార్యక్రమం కొనసాగింది.ఈ కార్యక్రమం కుపత్తి లత వెంకటేష్ కుటింభికులు ఉభయదార్లు గా కొనసాగారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
.
