ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికళ్ళు పోతున్నాయి ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్ల

కళ్ళు పోతున్నాయి ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్ల

📰 Generate e-Paper Clip

కళ్ళు పోతున్నాయి

-ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్ల

హెడ్ లైటులకు బ్లాక్ స్టిక్కర్, బ్లాక్ పాయింట్ రూల్స్ ని పునరుద్ధరించాలి.

శ్రీకాళహస్తి మే 24 (గరుడ దాత్రీ న్యూస్): రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడి లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయి,కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదు. గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది.. అసలు ఆ రూల్ వుందో తీసేసారో కూడా తెలియట్లేదు . ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న ఎల్ఈడి లైట్స్ గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!