మారుతున్న సత్యవేడు రాజకీయ సమీకరణాలు… నారాయణవనంలో కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరికలు
విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దాం…. KSR
గరుడధాత్రి :
సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్న టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై చేరికలు ప్రారంభమయ్యాయి.
నారాయణవనం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు భక్తవత్సల నాయుడు, గోవిందస్వామి, నాగరాజుల ఆధ్వర్యంలో… వైసిపికి చెందిన పలువురు కార్యకర్తలు, అలాగే కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న యువత శంకర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా టీడీపీలో చేరారు. వీరందరికీ కూరపాటి శంకర్ రెడ్ది పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నాయకులు, కార్యకర్తలు అందరూ చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.
మనమంతా ఒకే తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శ్రమించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడమే పరమావధిగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలి.”
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
