ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ వెంకట నారాయణ

కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ వెంకట నారాయణ

📰 Generate e-Paper Clip

ఐరాల కాణిపాకం జూలై 25 (గరుడ దాత్రి న్యూస్)

కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను శనివారం డీఎస్పీ వెంకట నారాయణ సందర్శించి స్టేషన్‌లో నిర్వహిస్తున్న పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సీడీ ఫైళ్లను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన చర్యలు సకాలంలో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కాణిపాకం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో, ఆలయానికి వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ ప్రాంతాల్లో గస్తీని పెంచడం, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచడం ద్వారా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!