ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం

కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం

📰 Generate e-Paper Clip

*కార్యకర్త కుటుంబానికి కొండంత అండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం*

*ఇటీవల మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమాని అందజేసిన కూరపాటి శంకర్ రెడ్డి…*

బుచ్చినాయుడు కండ్రిగ మండలం, ఆలత్తూరు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త బాబు రెడ్డి ఇటీవల అకాల మరణం చెందారు. అనుకోని కొన్ని కారణాల వల్ల మృతి చెందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలు రోడ్డు పడకుడదు అనే ఉద్దేశ్యంతో నారా లోకేష్ బాబు పార్టీ సభ్యత్వం ద్వారా ఏర్పాటు చేసిన ప్రమాద బీమా నేడు ఆ కుటుంబానికి భరోసానిచ్చింది.

లోకేష్ బాబు ముందు చూపు వల్ల ఈరోజు ప్రమాద బీమా రూపంలో ఐదు లక్షల రూపాయల చెక్కును మరణించిన కార్యకర్త బాబు రెడ్డి సతీమణి లక్ష్మికి అందజేసిన సత్యవేడు నియోజకవర్గం టిడిపి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబాలకు భరోసా కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ లోకేష్ గారి ముందుచూపు వల్ల నేడు అనేక కుటుంబాలకు ఆపత్కాలంలో ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని అయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!