ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్యానికి పెద్దపేట

కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్యానికి పెద్దపేట

📰 Generate e-Paper Clip

కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్యాని పెద్దపెట్టవేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, పటిష్ట చర్యలకు పూనుకుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు.
తడి- పొడి చెత్త సేకరణకు ట్రక్కులను అందుబాటులోకి తీసుకురావడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనాధక్షతకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
తడి- పొడి చెత్త సేకరణ కోసం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్రక్కులను బుధవారం కుప్పం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పి కే యం హుడా చైర్మన్ డాక్టర్ సురేష్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు కుప్పం రూరల్ మండలానికి చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కుప్పం రూరల్ మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు.
ట్రక్కుల ప్రారంభం అనంతరం చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
కుప్పం నియోజకవర్గాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఇప్పటికే కుప్పం అన్ని రంగాలలో ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గ నిర్దేశంలో పనిచేస్తూ కుప్పం అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!