-బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆత్మ బంధువులైన బిసి వర్గాలకు చెందిన వారిపై కక్ష పెంచుకున్న వైసిపి అరాచకానికి చి!! అమర్నాథ్ గౌడ్ అమరుడయ్యాడని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల అరాచకానికి అశువులు బాసిన అమర్నాథ్ గౌడ్ మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలుడి చిత్రపటానికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ పసి పిల్లాడిని కూడా చూడకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వైసీపీ దుర్మార్గానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అమర్నాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకున్నాను.
వైసిపి సైకోల దాష్టీకానికి బలైన ఎంతోమంది అమరులలో చి!! అమర్నాథ్ గౌడ్ మరణం చాలా బాధాకరమైనది అని, వైసిపి నాయకులు తన అక్కను వేధింపులకు గురి చేయడాన్ని చూసి తట్టుకోలేక ప్రశ్నిస్తే, జూన్ 15, 2023 న బడికి వెళ్తున్న 15 సంవత్సరాల చి!! అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసి చిన్నారి ప్రాణాలను చిన్న వయసులోనే చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
