ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికోర్టులో కేసులు ఉన్నా..జోరుగా భూ కబ్జా -రెవెన్యూ అధికారుల కళ్ళకు గంతలు..!!

కోర్టులో కేసులు ఉన్నా..జోరుగా భూ కబ్జా -రెవెన్యూ అధికారుల కళ్ళకు గంతలు..!!

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సోమవారం కొందరు దర్జాగా కబ్జా చేసుకోవడం జరిగింది ఒకపక్క తాసిల్దార్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకుంటున్న సందర్భంలోనే ఈ కబ్జాకు కొందరు తెర తీశారు బాధితులు లబోదిబోమని సంబంధిత విఆర్ఓ కు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయింది మాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయి… అధికారులు ఏం చేస్తారు…. పేదలు ఏం చేస్తారు.. మాదే ఆక్రమణ… మాదే భూమి అనే విధంగా ఈ ఆక్రమణ కొనసాగడం స్థానికంగా చర్చినియాంసంగం మారింది కోటమిట్ట ప్రాంతంలోని సర్వే నంబర్ 338 -1 లో సుమారు 16 సెంట్లు భూమిని సుమారు ఏడు మందికి ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తూ 2016 ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఎంతో లోతైన ఈ ప్రదేశాన్ని పట్టాదారులు కొద్దికొద్దిగా తీర్చిదిద్దుకుంటూ వచ్చారు ఈ నేపద్యంలో వైసీపీకి చెందిన కొందరు, ఇతర గ్రామపంచాయతీలు చెందిన మరికొందరు మాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయి… మాదే ఈ భూమి… వేరే వాళ్ళుకు ఆమ్మేశాం… మీకు దిక్కున చోట చెప్పుకోండి అని గతంలో జరిగింది.. ఇందులోని బాధితులు 6 మంది హైకోర్టు, జిల్లా కోర్టులను ఆశ్రయించి న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు బాధితులకు న్యాయం చేయాలని కోర్టు నుంచి ఉ్తతర్వులు కూడా వచ్చాయని సమాచారం విషయం తెలుసుకున్న ఆక్రమణదారులు సోమవారం మధ్యాహ్నం జెసిబి సహాయంతో ఈ 16 సెంట్లు భూమిని ఆక్రమించుకొని ఏకంగా దర్జాగా కంచ కూడా వేసుకున్నారు.. ఇదేంటి అన్యాయం… పేదల భూమిలో… స్థానికేతరుల కబ్జా… వైసిపి హయాంలో కూడా ఇంత ఘోరంగా జరగలేదు… స్థానిక రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి, కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా… ప్రజా ఫిర్యాదుల విభాగంలో వినతలు ఇవ్వడం… వాటికి ఇంకా పరిష్కారం చూపక పోగా… ఈ నేపథ్యంలో కబ్జా జరగడం అత్యంత బాధాకరమైన విషయం అని పట్టణవాసులు వాపోతున్నారు వాస్తవ పట్టాలు పరిశీలించి న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలకడం లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోర్టు ధిక్కరణ… ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు దారులకు ఇంకా అన్యాయం జరగకపోగా.. కబ్జా వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!