గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలి…
-భక్తులకు అంబలి పంపిణీ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరినీ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని ఆదివారం తన కార్యాలయం ముందు భక్తులకు రాగి అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా గంగమ్మ జాతరను పురస్కరించుకుని తమ కుటుంబం ప్రజలకు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, అంబలి పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఎవరికి అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఏడాది అమ్మ దీవెనలతో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండి లాభాలు గడించేలా చూడాలని ఆకాంక్షించారు.
