ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమం

గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

విద్య, ఓపెన్ స్కూల్ ప్రాముఖ్యతపై అవగాహన – ఋతుక్రమ ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ

పిచ్చాటూరు, మే 29 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు గాంధీనగర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు బజావతి, సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెషన్-9గా “విద్య మరియు ఓపెన్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత”తో పాటు “ఋతుక్రమ ఆరోగ్యం మరియు పరిశుభ్రత దినోత్సవం”పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి పిచ్చాటూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) డాక్టర్ ధనుష్, సీహెచ్ఓ శివయ్యతో పాటు వైద్య బృందం హాజరయ్యారు. విద్య యొక్క ప్రాముఖ్యత, మధ్యలో చదువు మానేసిన బాలికలకు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించే అవకాశాలపై ఐసిడిఎస్ సూపర్వైజర్లు వివరించారు.
అలాగే ఋతుక్రమ సమయంలో పాటించాల్సిన ఆరోగ్య, పరిశుభ్రత నియమాలపై డాక్టర్ ధనుష్ కిషోరి బాలికలకు అవగాహన కల్పించారు. శానిటరీ నాప్కిన్స్‌ను సరైన విధంగా ఎలా వినియోగించాలో వివరించి, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్య బృందం, కిషోర్ బాలికలు, వారి తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!