చిత్తూరుఆగస్టు,19( గరుడ దాత్రి న్యూస్)
చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని ఎస్సీ యువతతమఅర్హతలకుఅనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి పథకాలు,రుణసదుపాయాలు, సబ్సిడీ పథకాలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకుని, అర్హత ఉన్న పథకాలకు దరఖాస్తుచేసుకోవాల జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకారసంఘంసంచాలకులుశ్రీదేవితెలిపారు.ప్రభుత్వం ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు ఉపాధిఅవకాశాలనుమెరుగుపరుచుకునేందుకు అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల అర్హతలు, రుణ పరిమితి,సబ్సిడీ,లబ్దిదారుల వాటా, దరఖాస్తు విధానం తదితరవివరాలను అధికారికవెబ్సైట్ద్వారాతెలుసుకోవచ్చని,చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని ఎస్సీ యువతప్రభుత్వపథకాలపైపూర్తిఅవగాహనపెంపొందించుకుని,తమకుఅనుకూలమైన పథకాలను ఎంపిక చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకాలపై సందేహాలు లేదా దరఖాస్తుప్రక్రియకుసంబంధించిన సమాచారం అవసరమైనవారుసంబంధిత అధికారులయిన ఈవో పి జ్యోతి 9550762919, ఎ ఈ ఓ కే మేఘనాథ్ 9959403234, డి పి ఓ ఎస్ గిరీష్ 8074437025, డి ఇ ఓ ఎం శ్రీనాథ్ 8686149492, డి వో ఓ పి ప్రశాంత్ 9966079699 నంబర్లకు సంప్రదించి మార్గదర్శకత్వంపొందవచ్చని,apsccorporation.ap.gov.in అధికారిక వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ (APSCCFC) ద్వారా అమలు చేస్తున్న పథకాలు, అర్హతలు,దరఖాస్తు విధానం ఇతరవివరాలకోసంఅధికారికవెబ్సైట్నుసందర్శించవచ్చని, చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని అర్హత కలిగిన ఎస్సీయువతఈఅవకాశాలనుసద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి, ఉపాధి ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకుసాగాలనికార్యనిర్వాహకసంచాలకులు, DSCSCS Ltd., చిత్తూరు / తిరుపతి జిల్లాలుతెలిపారని జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్చిత్తూరుకార్యనిర్వాహకసంచాలకులుఒకప్రకటనలో తెలిపారు.
