ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచెరుకు క్రషర్ ప్రమాదంలో విద్యార్థి చేతి వేళ్లు తెగిపోవడం విషాదం

చెరుకు క్రషర్ ప్రమాదంలో విద్యార్థి చేతి వేళ్లు తెగిపోవడం విషాదం

📰 Generate e-Paper Clip

చెరుకు క్రషర్ ప్రమాదంలో విద్యార్థి చేతి వేళ్లు తెగిపోవడం విషాదం

కార్వేటినగరం మండలం టీకేఎం పేట పంచాయతీకి చెందిన దళిత కుటుంబానికి చెందిన యోజిత్ అనే 5వ తరగతి విద్యార్థి చెరుకు క్రషర్‌లో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బాలుడి కుడిచేతి ఐదు వేళ్లు పూర్తిగా తెగిపోయినట్లు సమాచారం.ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ పొన్న వెంటనే స్పందించారు. జనసేన పార్టీ తరఫున బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా యోజిత్ తండ్రితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించి, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!