ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు రామయ్యకు ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు రామయ్యకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 27 గరుడధాత్రి :
పలమనేరు లయన్స్ క్లబ్లో ఆదివారం ఉచిత కంటి చికిత్సా శిబిరం విజయవంతంగా జరిగింది. క్లబ్ చైర్మన్ గుణశేఖరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి మహతి ఫౌండేషన్ చైర్మన్ లయన్ నాగరాజు అన్ని వసతులు కల్పించారు. వైద్య శిబిరం అనంతరం కల్లుపల్లి హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చందనం రామయ్యను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రామయ్య సేవలకు గాను ఇటీవలే ఆయన ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల ఆరవ తేదీన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ కార్యక్రమంలో చందనం రామయ్యకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్ జయశంకర్, లయన్ పళని, లయన్ జై సింగ్, లయన్ నాగరాజు, ఇతర క్లబ్ సభ్యులతో పాటు స్థానిక ప్రముఖులు తిరుపతి బాలాజీ, రవి, మునెప్ప, శివాడి గోవిందు తదితరులు పాల్గొన్నారు. తనను ప్రత్యేకంగా గుర్తించి సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులకు, ప్రతినిధులకు రామయ్య ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!