ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెంగళత్తూరులో ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు

వెంగళత్తూరులో ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

సైబర్‌ మోసాలు, గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలి

పిచ్చాటూరు, సెప్టెంబర్‌ 27 గరుడధాత్రి:

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర సూచించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పిచ్చాటూరు మండలం వెంగళత్తూరు దళితవాడలో ఆదివారం ‘ఆపరేషన్‌ త్రిశూల్‌’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. మొబైల్‌ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని, సైబర్‌ నేరగాళ్ల మోసపూరిత పద్ధతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించిన ఎస్సై.. యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్సై రాఘవేంద్ర సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!