దళితుల హక్కుల పరిరక్షణకు టీడీపీ శాంతియుత నిరసన
-టీడీపీ మండల అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన
గరుడధాత్రి న్యూస్ :
గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులు తీవ్ర అణచివేతలు, వేధింపులు ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ఎల్లప్పుడూ దళిత సోదర సోదరీమణులకు అండగా ఉంటుందని టీడీపీ మండల అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు గురువారం ఉదయం సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దళితుల అభివృద్ధికి కుటామి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంధి అని, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు
