ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై దాడి

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై దాడి

📰 Generate e-Paper Clip

*చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై దాడి*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన*

*స్పందించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు*

*తక్షణ చర్యలకు ఆదేశం*

చిత్తూరు -30-04-26

జిల్లా కేంద్రమైన చిత్తూరులో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్పీ పై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని పై స్పందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..,

దాడి ఘటన సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. బాధిత ఆర్పీకి అధికారులు అండగా నిలవాలని.., అవగాహన రాహిత్యంగా వ్యవహరించి, విధుల్లో ఉన్న ఆర్పీ పై దాడి చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఓ మహిళా ఆర్పీ పై అమానవీయంగా ప్రవర్తించడం దురదృష్టకరమని ఖండించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ, నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు..

పొదుపు సంఘాల సభ్యులు కూడా తమ సమస్యను అధికారుల దృష్టికి తెచ్చి, సమన్వయంతో పరిష్కరించుకోవాలే గాని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదనీ, తొందరపడి భౌతిక దాడులకు దిగకూడదని ఆయన హితబోధ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!