ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురం లో ఘనంగా ప్రారంభమైన టీడీపీ పసుపు పండగ

నాగలాపురం లో ఘనంగా ప్రారంభమైన టీడీపీ పసుపు పండగ

📰 Generate e-Paper Clip

నాగలాపురంలో లో ఘనంగా ప్రారంభమైన టీడీపీ పసుపు పండుగ

టిడిపి మహానాడుకు హాజరైన పలువురు నేతలు
-ఘనంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు
గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం పట్టణంలోని స్థానిక కళ్యాణ మండపంలో గురువారం తెలుగుదేశం పార్టీ మహానాడు పసుపు పండుగ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించ నుండడంతో పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు,పార్టీ నిర్ణయాలు,తీర్మానాలు,చర్చలను వీక్షించి తెలుసుకునేలా భారీ ఎల్ ఇ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాగలాపురం టిడిపి పార్టీ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు సీనియర్లకు ప్రత్యేక గౌరవం అందించారు వారిని సన్మానించడం కూడా జరిగింది ప్రతి కార్యకర్త భరోసా కల్పించే విధంగా నాగలాపురం మినీ మహానాడు ఆకర్షించింది ఎన్నడు లేని విధంగా తండ్రికి తగ్గట్టుగా తనయుడు ప్రణీత్ రెడ్డి సేవలు అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియరనాయకులు పూలమాలలు వేసి ఘన సన్మానించారు.అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!