ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దాడులు నిర్వహించిన చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు

నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దాడులు నిర్వహించిన చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు

📰 Generate e-Paper Clip

*చిత్తూరు జిల్లా పోలీసు*

*తేదీ: 27-04-26*

*నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దాడులు నిర్వహించిన చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు*

*సుమారు 5,22,339 రూపాయల విలువ గల 57 బ్యాగుల నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.*

చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి. వెంకటనారాయణ గారు చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టికంటయ్య, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామచంద్ర, గుడిపాల ఎస్.ఐ శ్రీ రామ్మోహన్, ఎన్.ఆర్.పేట ఎస్.ఐ శ్రీ మణికంటేశ్వర రెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి 8 బృందాలుగా ఏర్పడి చిత్తూరు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు అంగళ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో సామిరెడ్డి వీధిలోని 3 దుకాణాలు, చర్చి వీధిలో ఒక దుకాణం, మణి హోటల్ జంక్షన్ సమీపంలో రెండు దుకాణాలలో హాన్స్, గుట్కా, కూల్ లిప్ వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొని సంబంధిత దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు డి.ఎస్పీ శ్రీ వెంకటనారాయణ గారు తెలిపారు.

చిత్తూరు 2 టౌన్ పరిధిలో సుమారు రూ. 4,33,250/- విలువైన 43 బ్యాగుల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిత్తూరు 1 టౌన్ సుమారు రూ. 89,089/- విలువ గల 14 బ్యాగుల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకుని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

అనధికారికంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వ, రవాణా మరియు విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఆరోగ్యానికి హానికరమైన ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండాలని, ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా వ్యాప్తంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి దాడులు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!