ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేడు అన్ని గ్రామపంచాయతీల్లో జీరో లేకుండా పనులు నిర్వహించాలి

నేడు అన్ని గ్రామపంచాయతీల్లో జీరో లేకుండా పనులు నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

-ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ఆదేశాలు

పిచ్చాటూరు, జూలై 2 గరుడధాత్రి :

మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో నేడు జీరో లేకుండా పనులు జరిగేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ఆదేశించారు.
ముందుగా ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ NMMS అటెండెన్స్ పూర్తి చేసి, సంబంధిత రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు లేని గ్రామాల్లో సచివాలయాలకు ఉదయం 11 గంటలకు కూలీలతో కలిసి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
అక్కడ నిర్వహించనున్న VB -G RAM -G లాంచింగ్ కార్యక్రమాన్ని లైవ్ కాస్ట్ ద్వారా కూలీలకు వీక్షింపజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లింక్‌ను ఈరోజు పది గంటల లోపు పంపిస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి, అన్ని గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీడీఓ మహమ్మద్ రఫీ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!