ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పదవి వచ్చిందనే అహంకారం వద్దు

పదవి వచ్చిందనే అహంకారం వద్దు

📰 Generate e-Paper Clip

*పదవి వచ్చిందనే అహంకారం వద్దు*

*అందరినీ కలుపుకుని ముందుకుసాగాలి*

*మిమ్నల్ని ఎలా గుర్తించామో మీరు కూడా అలాగే నాయకత్వాన్ని గుర్తించాలి*

*పార్టీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతుల్లో నారా లోకేష్ దిశానిర్దేశం*

మంగళగిరి: పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పార్టీ కేంద్రకార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం అనంతరం నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి మంత్రి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్ విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలి. మిమ్మల్ని ఎలా గుర్తించామో మీరు కూడా నాయకత్వాన్ని గుర్తించాలి. నాయకుల పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి బేరీజు వేస్తాం. నిన్నటి వరకు వేరు, ఈ రోజు నుంచి వేరు. మీరు చేసే ప్రతి పని పార్టీకి వర్తిస్తుంది. మీరు మంచి చేస్తే పార్టీకి మంచి జరుగుతుంది. ప్రతి అంశంపైనా అవగాహన ఉండాలి. పార్టీ నిర్మాణం, నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి. సమన్వయంతో ముందుకుసాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!