ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పది ఫెయిల్ అయ్యామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి....

పది ఫెయిల్ అయ్యామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి….

📰 Generate e-Paper Clip

*అన్నమయ్య జిల్లా మదనపల్లె….*

*పది ఫెయిల్ అయ్యామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి….*

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. విజయాలు, అపజయాలు అనేవి మానవ జీవితంలో సహజం. ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. బుధవారం మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. పది పాసైన, ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు అధైర్య పడవద్దన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులపట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించి వారిని ఓదార్చాలని తెలిపారు. పది తప్పుపోతే వెంటనే సప్లమెంటరి ఉందన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల మనసు నొప్పించే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరూ కూడా మాట్లాడవద్దన్నారు.

అపజయం వెనుక విజయం దాగుంటుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాలని సూచించారు.

ఫెయిల్ అయిన విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతుంటే వారికి ధైర్యం చెప్పి ఓదార్చాలన్నారు.

జీవితం అమూల్యమైనదని ఎవరూ కూడా చేజేతులారా పాడు చేసుకోవద్దని ఈసారి కాకపోతే వచ్చే ఏడాది విజయం సాధించవచ్చని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!