ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పది ఫలితాలలో రాజు విద్యాసంస్థల విద్యార్థులదే హవా...

పది ఫలితాలలో రాజు విద్యాసంస్థల విద్యార్థులదే హవా…

📰 Generate e-Paper Clip

పది ఫలితాలలో రాజు విద్యాసంస్థల విద్యార్థులదే హవా…

595 మార్కులు సాధించిన

రాజుల సిరి

అభ్యాసం, అంకితభావమే విజయానికి సోపానాలు..

ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు…

రాజు విద్యాసంస్థల కార్యదర్శి చమర్తి లోకేష్ రాజు..

తిరుపతి, ఏప్రిల్ 30:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నీ రాజు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందిబీ మోగించారు. రాజు విద్యాసంస్థలో మొత్తం 71 మంది పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశారు. 71 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. వారిలో 62 మంది విద్యార్థిని విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. వారిలో ఎస్ రాజుల సిరి అనే విద్యార్థిని 600 గాను 595 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఏ మనోహరి 593, బి పూర్విక 592, ధాత్రిక 591, విశ్వ సౌజన్య 591మార్కులు సాధించి తిరుపతి జిల్లాలో విజయదుంది బి మోగించారు. 100% ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను రాజు విద్యాసంస్థల కార్యనిర్వాక కార్యదర్శి చమ్మర్తి లోకేష్ రాజు అభినందించారు. శుక్రవారం సాయంత్రం రాజు విద్యాసంస్థలలో పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ రాజు విద్యాసంస్థల జోనల్ హెడ్ విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రెడ్డప్ప, అలెన్ హెడ్ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం లోకేష్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావం తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. మా రాజు విద్యాసంస్థలలో క్రమశిక్షణతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత బోధనలను చెప్పించడంతోపాటు వీక్లీ టెస్టులు నిర్వహించడం, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారికి కూడా మంచి మార్కులు సాధించేలా చేయడమే రాజు విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. తిరుపతిలో రాజు విద్యాసంస్థలను స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 100% ఫలితాలు సాధిస్తూ జిల్లాలో తమ విద్యా సంస్థ ప్రత్యేక గుర్తింపుకు నోచుకుందని చెప్పారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులలో మంచి ఫలితాలు సాధించి అటు తల్లిదండ్రులకు విద్యాసంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని లోకేష్ రాజు ఆకాంక్షించారు. రాజు విద్యాసంస్థలలో క్రమశిక్షణతో పాటు అధునాతన బోధనలతో విద్యను బోధించడంతోపాటు మంచి ఫలితాలు సాధించడమే ద్వేయమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!