ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సత్యవేడులో జాతర చాటింపు సందడి

సత్యవేడులో జాతర చాటింపు సందడి

📰 Generate e-Paper Clip

*సత్యవేడులో జాతర చాటింపు సందడి*

తిరుపతి జిల్లా సత్యవేడులో సదవాలమ్మ గంగ జాతర తొలి చాటింపు వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేపాకు తోరణాలు, అంబళ్లు, మొక్కులు, పొంగళ్ల నైవేద్యాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఉదయం గంగమిట్ట వద్ద ప్రత్యేక కలశాన్ని ఏర్పాటు చేసి, వేప తోరణాలు కట్టి మహిళలు తీసుకొచ్చిన అంబళ్లను అక్కడ ఉంచిన పాత్రలో పోసి మొక్కులు చెల్లించారు. అనంతరం సదవాలమ్మ ఆలయం వద్ద పొంగళ్లను సిద్ధం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, సత్యవేడు ప్రాంతం కరువు కాటకాలకు దూరంగా సుభిక్షంగా వర్ధిల్లాలని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.

చాటింపు సందర్భంగా పురవీధుల్లో తప్పెట్ల మోత మోగి జాతర సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చింది. పూర్వ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ తొలి చాటింపు కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

* *శుభ కలిశం గ్రామోత్సవం*

సత్యవేడు శ్రీ సదవాలమ్మ గంగ జాతర చాటింపు సందర్భంలో సాయంత్రం అమ్మవారి శుభ కలిశం గ్రామోత్సవం నిర్వహించారు.

భక్తులు గ్రామ పెద్ధలు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో కర్ఫూర హారతులును నివేదించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!