ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపర్యాటకాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత

పర్యాటకాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత

📰 Generate e-Paper Clip

–

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్

చెరువుల సంరక్షణకు సి ఎస్ ఆర్ ,P4, కమ్యూనిటీ పార్టిసిపేషన్‌నుప్రోత్సహిస్తాం

–జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్*..

చిత్తూరు, సెప్టెంబర్ 28(గరుడదాత్రిన్యూస్) చిత్తూరుజిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్,జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ తెలిపారు.సోమవారం చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని రెడ్డిగుంట నందు “రామోజీ ఫౌండేషన్” ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న రెడ్డిగుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులకు.., చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చూడా చైర్ పర్సన్ కట్టా కటారి హేమలత , ప్రముఖ పారిశ్రామికవేత్త శైలజ , మాజీ మేయర్ ఆముద, కూటమి నాయకులు తదితరులతో కలసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ – రెడ్డిగుంట చెరువు అభివృద్ధి ఇతర ప్రాంతాలకుఆదర్శమన్నారుపర్యావరణాన్ని కాపాడుకుంటూనే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం నేటి సమాజానికి అవసరమని, రామోజీ ఫౌండేషన్ లాంటి సిఎస్ఆర్
సంస్థలుద్వారా ముందుకు రావడంఅభినందనీయమన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి సహకారం అందిస్తానన్నారు.జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ -* జిల్లాలోని చెరువులనుసంరక్షించడంతో పాటు వాటి పరిసరాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు CSR, P4 మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్‌ను ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వ వనరులకు ప్రజల అవసరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధిని వేగంగా పూర్తి చేయవచ్చని, చెరువుల అభివృద్ధికి ప్రత్యేక బృందంతో 2-3 నెలల్లో సమగ్ర ప్రణాళిక తీసుకువస్తామని తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ -* చెరువులు మన సంస్కృతిలో భాగమని, వాటి సుందరీకరణతో స్థానికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ -* P4 విధానంతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని, చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరిగి, తాగునీటి ఎద్దడిని నుంచి చిత్తూరు నగరాన్ని కాపాడేందుకు వీలవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!