కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం చంద్రప్రభ వాహనం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం కానిపాకం అగరంపల్లెకు చెందిన మాజీ ఈవో కేశవులు కుటుంబం మేళ తాళాలు వాయిద్య బృందాలు కోలాటాల నడుము స్వామివారికిపట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి స్వామివారి దర్శనాల ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు వేదపండి తెలిసే ఆశీర్వాదం చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. ఏ ఈ ఓ లు రవీంద్రబాబు. ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు
