ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌ కు 9 అర్జీలు

పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌ కు 9 అర్జీలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్‌ కు 9 అర్జీలు

గరుడధాత్రి న్యూస్

మండల కేంద్రమైన పిచ్చాటూరులోని ఎంపీడీఓ కార్యాలయ సభా ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ చంద్రబాబు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 9 ఫిర్యాదులు అందాయి.వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 6 దరఖాస్తులు రాగా.. సీడీపీవో, మండల సర్వేయర్, పోలీసు శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రధానంగా భూ రికార్డుల్లో పట్టాదారుల పేర్ల సవరణ, ప్రైవేటు భూముల ఆక్రమణ, దారి వివాదాలు, పెండింగ్ రైస్ కార్డు సమస్యలపై బాధితులు తహసీల్దార్‌కు వినతులు సమర్పించారు.అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, ఆహార నిల్వల కొరతపై సీడీపీవోకు, స్థానికంగా ట్రాఫిక్ సమస్యలపై పోలీసులకు, కాలువలు, రోడ్లు తదితర ప్రభుత్వ పోరంబోకు భూముల సర్వే చేయాలని కోరుతూ మండల సర్వేయర్‌కు దరఖాస్తులు అందాయి. వచ్చిన ఈ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!