ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పెంచలకోనలో అశేష భక్తజనం మధ్య

పెంచలకోనలో అశేష భక్తజనం మధ్య

📰 Generate e-Paper Clip

*పెంచలకోనలో అశేష భక్తజనం మధ్య*

*శేష వాహనంపై శ్రీ నృసింహుని వైభోవం*

*రాపూరు:* పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి ఆదిలక్ష్మీదేవి,చెంచులక్ష్మీ దేవేరులతో కలిసి శేష వాహనంపై ఉరేగుతూ స్వామివారు మాడి వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు..అంతకుముందు స్వామి వారికి మధ్యాహ్నం రెండు గంటలకు క్రేన్ మండలపంలో స్నాపన తిరుమంజనం నిర్వహించారు.సాయంత్రం ఏడు గంటలకు కోనలోని సహస్ర దీపా అలంకరణ మండపంలో ఉంజల్ సేవను కన్నుల పండువగా నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి,ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి,పీర్ల సోమయ్య యాదవ్,చిర్ల వెంకటేశ్వర్లు,బొట్టు పూజిత,తోట ఉమ,శ్రీశైలం భార్గవ రామ్,మోదేపల్లి ఇందిర,కిన్నెర నరసింహరావు,పెమ్మసాని సుగుణమ్మ,మోమిడి దేవీక,ఈతముక్కలు సుగుణమ్మ,బొగ్గల భాస్కర్ రెడ్డి,దొంతల పుష్పాలత,తురిమేర్ల పెంచలయ్య,యాకసిరి అంకమ్మ,ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!