ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నారా లోకేష్ అంటే పెట్టుబడులు, అభివృద్ధి – వైఎస్సార్సీపీ అంటే హత్య రాజకీయాలు !

నారా లోకేష్ అంటే పెట్టుబడులు, అభివృద్ధి – వైఎస్సార్సీపీ అంటే హత్య రాజకీయాలు !

📰 Generate e-Paper Clip

నారా లోకేష్ అంటే పెట్టుబడులు, అభివృద్ధి – వైఎస్సార్సీపీ అంటే హత్య రాజకీయాలు !

వి కోట విలేఖరిని హత్య చేయడం బాధిస్తోంది…

టిడిపి రాష్ట్ర సీనియర్ నేత డాక్టర్ కోడూరు బాల సుబ్రహ్మణ్యం

తిరుపతి, ఏప్రిల్ 28 :

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంటే రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యమని, వైఎస్ఆర్సిపి అంటే హత్య రాజకీయాలు, భూమాఫియా బెదిరింపులు రౌడీయిజంతో గత ఐదేళ్ల కాలంలో పాలన సాగించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పెట్టుబడులు పోలవరం ప్రాజెక్టు పురోగతి కొత్త రైల్వే ప్రాజెక్టులు రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జాతీయ రహదారుల విస్తరణ ఆరు లైన్లో జాతీయ రహదారులు ఐటీ కంపెనీల పెట్టుబడులతో రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్టప్ ఎకో సిస్టం , డిజిటల్ అభివృద్ధి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు.

 

వీకోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ మోహన్ హత్యను తీవ్రంగా ఖండించిన డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం…

వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడానికి తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు ఇది పెద్ద దెబ్బగా ప్రకటించాల్సిన అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!