గరుడధాత్రి :
తిరుపతి: ఈనెల 28వ తేదీ మహానాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి పెయింట్ వేసి ముస్తాబు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మీడియా ఈనెల 28వ తేదీ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరవుతారన్నారు . దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుపతి నగరంలో అనేక కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు .అలాగే సిమ్స్, బర్డ్స్, పద్మావతి మహిళ యూనివర్సిటీ, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. అటు రాజకీయ రంగంలో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు.
