ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

📰 Generate e-Paper Clip

-లెనిన్ సెంటర్‌లో జర్నలిస్టుల ధర్నా – బెదిరింపులు ఆపాలని డిమాండ్

విజయవాడ, మే 28,గరుడధాత్రి న్యూస్ :

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, బెదిరింపుల పర్వం ఆపాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు షేక్ ఖాజావలి,ఏపీబీజేఏ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం. రాఘవులు,ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. శ్రీనివాస్,ఎం.బేనాథన్,జిల్లా గౌరవ అధ్యక్షులు కే. కలిమిశ్రీ, జిల్లా కోశాధికారి సురేష్ బాబు,జిల్లా నాయకురాలు జ్యోతిర్మయి,జిల్లా నాయకులు విహెచ్. రాజు,పి.నరేష్,కే.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!