బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 12 గరుడదాత్రి:
చాలా రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న బైరెడ్డిపల్లి మండల ప్రజలకు శనివారం సాయంత్రం కురిసిన వర్షం కొంత ఊరటనిచ్చింది. సుమారు మూడు నెలలుగా సరైన వర్షపాతం లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించింది.
వర్షంతో పాటు కొద్దిసేపు తీవ్రంగా గాలులు వీచాయి. భారీ వర్షం కాకపోయినప్పటికీ, కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని మురుగునీటి కాలువలు నీటితో నిండిపోయాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం రహదారులపైకి కొట్టుకురావడంతో ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యారు.
మరోవైపు వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కురిసిన వర్షం మరోసారి వారంలోపు కురిస్తే పంటలకు కొంత ప్రయోజనం చేకూరడంతో పాటు మూగజీవాలకు పశుగ్రాసం లభించే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు, పశువులకు అవసరమైన నీరు, పశుగ్రాసం లభించాలని రైతులు కోరుతున్నారు.
బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో కురిసిన వర్షం.. ప్రజలకు ఊరట
RELATED ARTICLES
