ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వినాయక చవితి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

వినాయక చవితి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 12 గరుడ ధాత్రి న్యూస్

స్థానిక శ్రీ మృత్యుంజేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల పోస్టర్‌ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 20 నిమజ్జనంతో ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. పూజలు, సాంస్కృతిక విశేషాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆవిష్కరించిన పోస్టర్‌లో పొందుపరిచారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విజయ వాణి సంస్థల ప్రతినిధి నాయిని మహేష్ కుమార్, పిల్లారి జీవన్ ప్రకాష్, లీలా కుమార్, నాగ్, అరుణ్ కుమార్ శెట్టి పవన్ కుమార్, కొమ్ము అర్జున్ రాయల్, కుంచి నరేష్, కుంచి రాజేష్, సాగర్ నాయుడు, దీపు రాయల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!