కుప్పం,సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి న్యూస్):విజయవాడలో జరిగిన వైద్యారోగ్య అభివృద్ధి కార్యక్రమ వేదికపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ముచ్చటిస్తూ సెల్ఫీ దిగడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, ఉమ్మడి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. “కిచెనే ఫార్మసీ-ఆహారమే ఔషధం” అని చంద్రబాబు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదే మూలసూత్రమని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ వైద్యారోగ్య రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అభినందించారు. అలాగే పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ-నీవా వంటి కీలక ప్రాజెక్టుల పునఃప్రారంభం పట్ల జేపీ నడ్డా ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.
